వైవాహిక జీవితంలో భార్యాభర్తలిద్దరూ కలిసి ఆనందంగా జీవించాలని అనుకుంటారు. భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు కామన్ గా వస్తూ ఉంటాయి. కానీ వాటిని మనం పట్టించుకోకూడదు. ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుంటూ పోతే భార్యాభర్తల మధ్య అస్తమాను ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అలా కాకుండా భార్య భర్తలు సమస్యలు అన్నిటిని విడిచి హాయిగా ఉండాలి. ఒకరి సంతోషం కోసం మరొకరు కొన్ని త్యాగాలు చేయాలి అలానే భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
ఒకరిపై ఒకరు కోపం తెచ్చుకుంటూ పోతే ఆ జీవితంలో ఇక ఆనందమే ఉండదు. ఎప్పుడైనా సరే మనస్పర్ధలు ఎక్కువగా కొనసాగితే ఆ బంధం చెడిపోతుంది. కచ్చితంగా మీ జీవిత భాగస్వామికి సమయాన్ని ఇవ్వండి. మీరు ఎంత బిజీగా ఉన్నా వాళ్లతో కాసేపు గడపండి కాసేపు మీ జీవిత భాగస్వామితో సమయం ఇస్తే ఖచ్చితంగా మీ బంధం బాగుంటుంది.
మీ ప్రేమని తెలియజేయడానికే వాళ్ళని ఆశ్చర్యపరచండి. సర్ప్రైజ్ ఇవ్వండి. కోపంగా ఉన్నప్పుడు ఏదైనా సర్ప్రైజ్ ఇస్తే వెంటనే ఆ కోపం చల్లారిపోతుంది. ఎల్లప్పుడూ మీ మధ్య ప్రేమ ఉండేలా కాకుండా ప్రత్యేక అనుభూతిని కలిగించండి. ఇలా చేయడం వలన రిలేషన్షిప్ తాజాగా ఉంటుంది. ఉత్సాహంగా ఉంటుంది. మరి ఇక వెంటనే వీటిని పాటించేసి మీ జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఉండండి.