స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డబ్బులు డిపాజిట్ చేయాలని భావించేవాళ్లకు అదిరిపోయే స్కీం అందుబాటులోకి వచ్చింది. ముత్తూట్ ఫిన్ కార్ప్ తమ కస్టమర్లకు ఏకంగా 9శాతానికి రాబడిని పెంచుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. డబ్బులు పెట్టుబడి పెట్టి అధిక మొత్తంగా సంపాదించాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు ఓ శుభవార్త. మీకోసం ఒక అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. ముత్తూట్ ఫిన్‌కార్ప్ తాజాగా నాన్ కన్వర్టిబుల్ డిబెంచర్ (ఎన్సీడీ) స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కీంలో డబ్బులు పెట్టుబడి పెడితే అదిరిపోయే రాబడి పొందొవచ్చిని సంస్థ ప్రకటించింది. ఏకంగా 9.62 శాతం వరకు పెట్టుబడిపై వడ్డీ లభిస్తుంది సంస్థ వెల్లడించింది.
ముత్తూట్ ఫిన్‌కార్ప్ ఎన్సీడీల్లో డబ్బులు పెట్టుబడి పెట్టిన వారు నెల నెలా వడ్డీ తీసుకోవచ్చని సంస్థ పేర్కొంది. నెల నెలా డబ్బులు తీసుకోవద్దని భావించేవాళ్లు ఏకంగా సంవత్సరానికి ఒకేసారి వడ్డీ డబ్బులను పొందొవచ్చన్నారు. వడ్డీ డబ్బులు తీసుకోవడం ఇష్టం లేకపోతే ఆ డబ్బులను అలాగే పెట్టుబడి పెట్టినా డబ్బుకు ఇంట్రెస్ట్ యాడ్ అవుతుందన్నారు. మెచ్యూరిటీ కాలంలో ముగిసిన తర్వాత అసలు, వడ్డీ పొందొచ్చని సంస్థ సూచించింది.
డబ్బులు పెరగడానికి సంబంధించిన పూర్తి వివరాలను ముత్తూట్ ఫిన్‌కార్ప్ వెబ్‌సైట్ లో పొందుపర్చడం జరిగిందన్నారు. ఎన్సీడీలో ఈ నెల 23వ తేదీ వరకు డబ్బులు పెట్టుబడి పెట్టవచ్చన్నారు. ఈ స్కీం 27 నెలల నుంచి 60 నెలల కాల పరిమితిలో ఉంటుందని, అప్పటివరకూ డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు. ఇప్పటివకే క్రిసిల్ సంస్థ ముత్తూట్ ఫైనాన్స్‌కు ‘ఏ’ గ్రేడ్ రేటింగ్ ఇచ్చింది. డబ్బుకు పెట్టుబడి పెట్టడానికి ఎలాంటి రిస్క్ లేదని క్రిసిల్ సంస్థ నిర్ధారించింది. మీ డబ్బుకు పెద్దగా రిస్క్ ఉండదని అర్థం చేసుకోవాలి.
ముత్తూట్ ఫిన్‌కార్ప్ ఈ ఎస్పీడీల ద్వారా రూ.200 కోట్లు సమీకరించాలనే లక్ష్యంతో పని చేస్తోంది. ఈ నెల 23వ తేదీ నుంచి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వీటిల్లో డబ్బులు పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో కనీసం రూ.10,000 వరకు పెట్టుబడి పెట్టాలి. కస్టమర్లు పెట్టుబడి పెట్టిన డబ్బులపై 8.85 శాతం నుంచి 9.62 శాతం మధ్యలో వడ్డీ వర్తిస్తుందని. మీరు ఎంచుకునే ఆప్షన్ బట్టి వడ్డీ మారుతుందని సంస్థ వెల్లడించింది.