కరోనా కాలం మొదలైనప్పటి నుంచి ప్రతి ఒక్కరూ మాస్కుల వాడకం మొదలైంది. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుత పరిస్థితికి మాస్కు ప్రాధాన్యత గురించి ప్రజలలో అవగాహన కలిగిస్తున్నారు. మాస్కు లేకుండా ఎవ్వరూ బయటకి రావద్దని ప్రభుత్వాలు ప్రజలను కోరాయి. కరోనా ను అరికట్టేందుకు మాస్క్ ధరించడం అనేది నేడు అత్యవసరం గా మారింది. మాస్కుల వాడకం మొదలైన దగ్గర నుంచి వాటి కొరత ఏర్పడింది.
ఈ కారణంగా కొందరు వాటి అవసరం ప్రజలకు ఉండటం పట్ల అవగాహన కలిగి కొందరు వాటిని ప్రజలకు స్వచ్చందంగా పంపిణీ చేస్తున్నారు. ఇదే విధంగా తనకు తోచిన రీతిలో ఒక మటన్ వ్యాపారి కూడా తన షాప్ కు మటన్ కొనేందుకు వచ్చిన వారికి ఉచితంగా మాస్క్ లు అందజేశారు. ముషీరాబాద్ శివాలయం చౌరస్తా సమీపంలోని జమల్‌పురి ఆనంద్ షాపులో ఆదివారం మటన్ కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికీ మాస్క్‌లను ఉచితంగా ఇచ్చారు.
కరోనా నేపథ్యంలో సుమారు 300 మాస్క్‌లు వినియోగదారులకు అందజేశామని షాపు యజమాని జమల్‌పురి ఆనంద్ తెలిపారు. తమ దుకాణానికి వచ్చే వారికి మాస్క్‌లను అందజేయడం తోపాటు భౌతికదూరం పాటించాలని, శానిటైజర్లను వాడాలని సూచిస్తున్నట్లు తెలిపారు. తమ షాపులో పని చేసే వారు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించేలా చర్యలు తీసుకున్నామని వివరించారు.