మద్యం మత్తులో తల్లితండ్రులను చంపిన టెక్కీ? మదర్స్‌డే రోజే..

-

మానవత్వం మంటగలుస్తుంది.. మద్యం మత్తు ఎంతకైనా తెగించేలా చేస్తుంది. బెంగుళూరులో వృద్ధ దంపతుల హత్య కలకలం రేపింది. సొంత కొడుకే తల్లితండ్రులను హత్య చేసేందుగు తెగించాడని విశ్వసనీయవర్గాల సమాచారం.  మద్యం మత్తులో బెంగుళూరుకు చెందిన టెక్కీ తల్లితండ్రులను హత్య చేశాడనే అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలింపుల్లో బాగంగా వైన్స్‌ షాపులు తెరిచిన విషయం తెలిసిందే. మద్యం షాపులు తెరిచిన నాటి నుండి నవీన్‌ పీకల దాకా మద్యం సేవించి వచ్చి ఇంట్లో గొడవపడేవాడని తెలుస్తుంది. ఆదివారం మదర్స్‌డే రోజున కూడా ఎప్పటిలానే నవీన్‌ మద్యం సేవించి రావడం.. తల్లితండ్రులు మందలించడం జరగడంతో నవీన్ వారిద్దరినీ పదునైన కత్తితో పొడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మద్యం మత్తులో తల్లితండ్రులను చంపిన టెక్కీ

తమ తల్లితండ్రులను ఎవరో చంపారంటూ నవీన్‌ పోలీసుల ముందు తెలిపినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో బాగంగా నవీన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ రోహిణి చెప్పారు. గోవిందప్ప రిటైర్డ్‌ ఉద్యోగి అని, ఆయన భార్య శాంతమ్మ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేసేదని డీసీపీ తెలిపారు. సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా నవీన్ సంపాధించిన డబ్బులు విచ్చవిడిగా ఖర్చు చేసేవాడని, ప్రతీ రోజూ తల్లిదండ్రులు డబ్బులు కోసం వేధింపులకు గురి చేసేవాడని విచారణలో తెలిసిందని డీసీపీ రోహిణి చెప్పారు.

సంపాదించిన డబ్బులన్నీ తాగుడుకే ఖర్చు చేసేవాడని, ఇంతకు తెగిస్తాడని అనుకోలేదని బందువులు, చుట్టుపక్కల వారు కంటతడి పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version