ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో గతంలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ పార్టీ దారుణంగా ఓటమి పాలైన విషయం తెలిసిందే. 151 స్థానాల నుంచి ఏకంగా 11 స్థానాలకు పడిపోయింది. మాజీ సీఎం జగన్ తన హయాంలో ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా ఎందుక ఓడిపోయాననే తెలియలేదని వాపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇదిలాఉండగా వైసీపీ ఓటమికి, తన ఓటమికి మందుబాబులే కారణమని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మద్యం ధరలు తగ్గిస్తామని మందుబాబులకు మాయమాటలు చెప్పి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. నాణ్యమైన మద్యం అందిస్తామని మభ్యపెట్టి మోసం చేశారు.ఇతర రాష్ట్రాల్లో రూ.85లకే వచ్చే చీప్ లిక్కర్ ఆంధ్రలో వంద రూపాయలకు అమ్ముతున్నారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.