పెద్ద అవినీతి తిమింగలం మాజీ మంత్రి ఆర్కే రోజా. ఆడుదాం ఆంధ్ర పేరుతో నిలువు దోపిడీ చేశారు అని తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీ శాప్ ఛైర్మన్ రవినాయుడు పేర్కొన్నారు. కేవలం ఎన్నికల స్టంట్స్ కోసం ప్రభుత్వ సొమ్మును దుబారాగా దుర్వినియోగం చేశారు. రోజా నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర లో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఓట్ల కోసం 17 ఏళ్లు పైబడిన చిన్నారులకే అవకాశం కల్పించారు అని వివరించారు.
ఇక క్రీడల్లో ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు ఒక్క చిన్న సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదు. టూరిజం శాఖ మంత్రి అయితే రోజు తిరుమలకు వెళ్లి వందల మందికి దర్శనం చేయిస్తారా అని ప్రశ్నించిన ఆయన… ఈ రెండు అంశాలపై సీఐడీ విచారణ జరిపిస్తాం. తిన్న అవినీతి సొమ్మును కక్కిస్తాం అని పేర్కొన్నారు. అసలు తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రోజాను కచ్చితంగా జైలుకు పంపిస్తాం అని రవి నాయుడు స్పష్టం చేసారు.