ఏపీలోని ప్రకాశం జిల్లాలో పీసీ పల్లి మండలం దివాకరపల్లి సమీపంలో మంత్రి నారా లోకేశ్ రిలయన్స్ అధినేత అంబానీ తనయుడు ఆకాశ్ అంబానీ సంయుక్తంగా కంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ) ప్లాంటును ప్రారంభించారు.‘బయో ఫ్యూయల్ ఉత్పత్తిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుందని, ప్రాజెక్టు కోసం రిలయన్స్ సంస్థ రూ.65 వేల కోట్ల పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. దీని ద్వారా సుమారు 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఈ సందర్బంగా మంత్రి నారాలోకేశ్ మాట్లాడుతూ..‘నా ధైర్యం, నా బ్రాండ్ ఒక్కడే..అదే చంద్రబాబు..తెలంగాణకు హైదరాబాద్, తమిళనాడుకి చెన్నై, కర్ణాటకకు బెంగుళూరు ఉంది.. మాకు చంద్రబాబు ఉన్నారు.ఆయన ఈ రాష్ట్ర రూపురేఖలను మారుస్తారు.ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా మేనిఫెస్టోలో పెట్టాలని సీఎం చంద్రబాబును కోరాను’ అని నారాలోకేశ్ వెల్లడించారు.