నా గుండె బరువెక్కింది : సీఎం చంద్రబాబు ట్వీట్

-

దేశ సరిహద్దుల్లో విధి నిర్వహణలో భాగంగా ఏపీకి చెందిన జవాన్ మురళి నాయక్ భౌతిక కాయానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లా కళ్లితండాలో ఆయనకు ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. అధికారిక లాంఛనాలతో మురళీ నాయక్ అంత్యక్రియలను ప్రభుత్వం నిర్వహించింది. అంతిమయాత్రకు ముందు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీర జవాన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

cbn

ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు తన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘వీర జవాన్ మురళీ నాయక్‌కు అంతిమ వీడ్కోలు పలుకుతున్నాను. ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల శోకంతో నా గుండె బరువెక్కింది. దేశ రక్షణలో ప్రాణాలర్పించిన మురళి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.50 లక్షల పరిహారం ఇస్తాం. 5 ఎకరాల సాగుభూమితో పాటు.. 300 గజాల ఇంటి స్థలం కేటాయిస్తాం. అదే విధంగా ఆయన ఫ్యామిలీలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం.మురళీ నేడు మన మధ్య లేకపోయినా..ఆయన దేశం కోసం చేసిన త్యాగం ఎప్పుడు స్ఫూర్తి రగిలిస్తునే ఉంటుందని తెలుపుతూ నివాళి ఘటిస్తున్నాను’ అని రాసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news