కాల్పుల విరమణకు ఒకే అని చెప్పి రాత్రి కాగానే కాల్పులకు తెగబడిన పాక్.. సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. దీనిపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉన్నది. నిన్న రాత్రి పాక్ నుంచి డ్రోన్లు ఆదేశంతో సరిహద్దులు పంచుకుంటున్న భారత భూభాగంలోనికి వచ్చాయి. వీటిని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కూల్చాయి.
ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్రమోడీ తన నివాసంలో త్రివిద దళాధిపతులు, సీడీఎస్ అనిల్ చౌహాన్ , రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్‌తో సమావేశం అయ్యారు. ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణతో పాటు రేపు జరగనున్న ఇరుదేశాల సైనిక అధికారుల మధ్య జరగాల్సిన చర్చల విషయమై ఇందులో చర్చిస్తున్నట్లు సమాచారం. సరిహద్దు భద్రత, సైనిక సన్నద్ధత, పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే విషయాలపై కూడా ప్రధాని మోడీ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.