అర్జెంటీనాలో బుధవారం 60 ఏళ్ళ వయసులో గుండెపోటుతో మరణించిన ఫుట్బాల్ లెజెండ్ డియెగో మారడోనాకు భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నివాళులర్పించారు. “నా హీరో ఇక లేడు .. నా మాడ్ జీనియస్ ఆత్మకు శాంతి చేకూరాలి అని పేర్కొన్నాడు. నేను మీ కోసం ఫుట్బాల్ చూశాను..” అని గంగూలీ ట్వీట్ చేశారు. గొప్ప ఫుట్బాల్ క్రీడాకారులలో ఒకరిగా పేరుపొందిన అర్జెంటీనా ప్రపంచ కప్ విజేత కెప్టెన్ గుండెపోటుతో మరణించాడు.
ఈ నెల ప్రారంభంలో మెదడు శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడని అతని కుటుంబ సభ్యులు చెప్పారు. సచిన్ కూడా ట్వీట్ చేసారు. “ఫుట్ బాల్ మరియు క్రీడా ప్రపంచం నేడు దాని గొప్ప ఆటగాళ్ళలో ఒకరిని కోల్పోయింది. రెస్ట్ ఇన్ పీస్ డియెగో మారడోనా!” అని ట్వీట్ చేసాడు.
My hero no more ..my mad genius rest in peace ..I watched football for you.. pic.twitter.com/JhqFffD2vr
— Sourav Ganguly (@SGanguly99) November 25, 2020