రాష్ట్రంలో అతిపెద్ద కుంభకోణం రైతు భరోసా కేంద్రాలు : నాదెండ్ల మనోహర్‌

-

మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. తాజాగా ఆయన తెనాలిలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అతిపెద్ద కుంభకోణం రైతు భరోసా కేంద్రాలు అని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 10,700 రైతు భరోసా కేంద్రాల్లో అవినీతి జరుగుతున్నట్టు విజిలెన్స్ నివేదిక చెబుతోందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతుల వద్ద లంచాలు తీసుకున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమేనని ఆరోపించారు నాదెండ్ల మనోహర్. ఈ-క్రాప్ కోసం కూడా లంచాలు తీసుకుంటున్నారని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. జగన్ సీఎం అయ్యాక రైతులను కూడా కులాల వారీగా గుర్తిస్తున్నారని విమర్శించారు నాదెండ్ల మనోహర్. ధాన్యం కొనుగోళ్లలోనూ అక్రమాలు జరుగుతున్నాయని నాదెండ్ల మనోహర్ అన్నారు. అధికార పార్టీ నేతల వసూళ్లు పెరిగాయని తెలిపారు నాదెండ్ల మనోహర్.

గంజాయి కేసుల్లో చిన్నవాళ్లను మాత్రమే అరెస్ట్ చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. గంజాయి నిర్మూలన చేస్తున్నందుకే గత డీజీపీని తొలగించారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. అంతేకాకుండా.. పేదలకు ఇళ్ల నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వానిది దోబూచులాట అని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జగనన్న కాలనీలు, పట్టణ ప్రాంతాల్లో టిడ్కో గృహాలు అర్హులైన పేదలకు చెందడం లేదని విమర్శించారు. దీని వెనుకున్న అసలు కారణాలను ప్రజలకు తెలిపేందుకు జనసేన పార్టీ నడుం బిగించిందని.. క్షేత్ర స్థాయిలో ఇల్లు కట్టుకునేందుకు పేదలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, జగనన్న కాలనీల పరిస్థితి ఎలా ఉందో బయట పెడతామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version