తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ కేంద్రం తెలిపింది. ఈ వారం ప్రారంభం నుంచి తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు నిలిచిన పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేకించి దక్షిణ తెలంగాణను అప్రమత్తం చేసింది వాతావరణశాఖ. అలాగే.. మూడు, నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కాగా, ఆలస్యంగా ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు క్రియాశీలకంగా ఉన్నాయి. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి అవి తిరోగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సారి ముందస్తుగానే ఈశాన్య రుతుపవనాల రాక మొదలు కావొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది.