ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో గత సంవత్సరం విడుదలైన చిత్రం “కల్కి 2898AD”. ఈ సినిమా గత సంవత్సరం విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా దీపికా పదుకొనే అద్భుతంగా నటించింది. ఈ సినిమాకు సీక్వెల్ గా కల్కి-2 సినిమా షూటింగ్ ను తొందరలోనే ప్రారంభించనున్నారు. అయితే కల్కి పార్ట్ 1 సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించింది.

కానీ పార్ట్-2 సినిమాలో దీపిక నటించడం లేదంటూ ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయాన్ని స్వయంగా వైజయంతి మూవీస్ సంస్థ ఎక్స్ వేదికగా షేర్ చేసుకుంది. దీంతో నెటిజన్లు దీపిక పదుకొనే ఎందుకు నటించడం లేదంటూ ఆరా తీస్తున్నారు. దీపికా పదుకొనే వేరే సినిమా షూటింగ్లలో బిజీగా ఉండడం వల్లనే నటించడం లేదని కొంతమంది అంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం దీపికా పదుకొనే కు సంబంధించిన ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.