`మహానటి` ఫేమ్ యంగ్ డైరెక్టర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని సినిమా హాల్స్ విషయంలో సూటిగా ప్రశ్నించారు. బార్‌లు పనిచేయడానికి అనుమతించినప్పుడు, సినిమా హాళ్లు ఎందుకు తెరవకూడదు? అని నాగ్ అశ్విన్ ప్రభుత్వాలని ప్రశ్నించారు. కరోనా వైరస్ తీవ్రత ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తగ్గలేదు. అయినా దాదాపు అన్ని వ్యాపారాలకు అనుమతి ఇస్తున్నారు.
ఈ నేపథ్యంలో సినిమా హాళ్లు రీ ఓపెన్ చేయడానికి ప్రభుత్వాలు అనుమతి ఇవ్వాలని దర్‌శకుడు నాగ్ అశ్విన్ ప్రభుత్వాలని డిమాండ్ చేయడం ఆసక్తికరంగా మారింది. సినిమాలని యాప్‌లు, ఓటీటీల్లో కాకుండా సినిమా థీయేటర్లలో చూడాలని ఆయన అన్నారు.
`నేను అందరి భద్రతను కోరుకుంటున్నాను. అయితే జిమ్‌లు, బార్‌లు, రెస్టారెంట్లు, మాల్స్, దేవాలయాలు, బస్సు, రైలు, మెట్రో, విమానాన సర్వీసులు ప్రారంభించినప్పుడు సినిమా థియేటర్లు కూడా తెరిచే సమయం వచ్చిందని భావిస్తున్నాను. థియేటర్లలో మాస్క్ ధరించి సినిమా చూడటానికి ఆగలేకపోతున్నాను. ఇందులో పాజ్ చేయడం. ఫాస్ట్ ఫార్వడ్ చేయడం సాధ్యం కాదు` అని నాగ్ అశ్విన్ ట్వీట్ చేశారు.
I’m all for safety, but with gyms, bars, restaurants, malls, temples, bus, train, metro, flights open, it feels about time even movie theaters open…cant wait to mask up and watch movies the way they are meant to be watched…not pause, fast-forward, rewind…
— Nag Ashwin (@nagashwin7) September 29, 2020