అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు అక్కినేని నాగచైతన్య అలాగే ఆయన భార్య శోభిత ఇద్దరు తిరుమలలో మెరిశారు. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని నాగచైతన్య అలాగే శోభిత ఇద్దరు దంపతులు దర్శించుకోవడం జరిగింది. విఐపి విరామ సమయంలో ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారి సన్నిధిలో… శ్రీవారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ అధికారులు కూడా ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా అక్కినేని నాగచైతన్యకు రెండవ వివాహం అన్న సంగతి తెలిసిందే. హీరోయిన్ సమంత తో గత మూడు సంవత్సరాల కిందట విడాకులు తీసుకున్నాడు. అనంతరం హీరోయిన్ శోభితను వివాహం చేసుకున్నాడు నాగచైతన్య.
సతీమణితో కలిసి తిరుమల శ్రీ వారిని దర్శించుకున్న అక్కినేని నాగచైతన్య. @chay_akkineni #andhrapradesh #tirumala #NagaChaitanya #shobithadhulipala #RTV pic.twitter.com/LfnnTLjE9M
— RTV (@RTVnewsnetwork) August 21, 2025