ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత బస్సు కొంప ముంచేలా కనిపిస్తోంది. ఫ్రీ బస్సు నేపథ్యంలో… సీట్ల కోసం మహిళలు దారుణంగా కొట్టుకుంటున్నారు. ఏపీలో సీటు కోసం జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళల వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. విజయవాడ నుంచి జగ్గయ్యపేట వెళ్తున్న బస్సులో సీటు కోసం మహిళల మధ్య గొడవ చోటుచేసుకుంది.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. దీనిపై వైసీపీ సోషల్ మీడియా దారుణంగా ట్రోలింగ్ చేస్తోంది. కాగా తిరుమల వెళ్లే భక్తులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్న ఆర్టీసీ సంస్థ ఇకపై తిరుమల కొండపై కూడా అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు కీలక ప్రకటన చేశారు. అయితే ఘాట్ రోడ్డు కావడం వల్ల సీటింగ్ వరకే అనుమతి ఇస్తున్నామని వివరించారు.
ఫ్రీ బస్ ఎఫెక్ట్
ఏపీలో సీటు కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలు
విజయవాడ నుంచి జగ్గయ్యపేట వెళ్తున్న బస్సులో సీటు కోసం మహిళల మధ్య గొడవ pic.twitter.com/T89rsi5yiD
— Telugu Scribe (@TeluguScribe) August 21, 2025