నాగచైతన్య అలా చేయడం తట్టుకోలేకపోయా.. నా జీవితంలోనే అత్యంత బాధాకర సంఘటనది..” నాగార్జున

-

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున తన కొడుకు నాగచైతన్యతో ఉన్న అనుబంధాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.. మీ జీవితంలో మీరు అత్యంత బాధపడిన సందర్భం ఏది అని నాగార్జునని అడగగా.. అతను చెప్పిన సమాధానం అందరినీ కంటతడి పెట్టించింది..

 

అక్కినేని నాగార్జున దగ్గుబాటి రామానాయుడు కుమార్తె అయిన లక్ష్మిని మొదటి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.. వీరిద్దరి సంతానమైన నాగచైతన్య తల్లితండ్రీ విడాకుల అనంతరం తల్లి దగ్గరే పెరిగాడు.. అయితే ఆ సమయంలో ఎప్పుడైనా సెలవులు వచ్చినప్పుడు తరచూ తన తండ్రి దగ్గరికి వచ్చి వెళుతూ ఉండేవాడట.. అయితే సెలవులుకని వచ్చిన నాగచైతన్య అవి పూర్తవుగానే మొత్తం తన వస్తువులు సర్దుకొని వెళ్ళిపోవాల్సి వచ్చేదట.. అయితే అలా నాగచైతన్య వెళ్ళిపోతుంటే నాగార్జునకి ఎంతో బాధగా అనిపించేట.. అ క్షణంలో చాలా బాధపడేవాడిని.. అయితే తన స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం పూర్తయ్యాక మళ్ళీ నా దగ్గరకు వచ్చేసాడు.. ఆ సందర్భంలో నేను చాలా చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను అంటూ నాగార్జున తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు..

ఇప్పటికే ఎన్నో సార్లు తన కొడుకుతో ఉన్న అనుబంధాన్ని చెప్పుకొచ్చిన నాగార్జున.. చై తనకు మార్గ నిర్దేశం చేస్తాడని.. తను టెన్షన్ పడే చాలా విషయాల్లో కూర్చో బెట్టి మరీ మంచీ చెడు చెప్తాడని.. ఆ టైం లో చాలా రిలీఫ్ గా అనిపిస్తుందని చెప్పుకొచ్చారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version