మీడియాకు భ‌యంక‌ర‌మైన‌ క‌రోనా వైర‌స్ సోకిందంటూ నాగ‌బాబు సంచ‌ల‌న ట్విట్‌..!!

-

మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ప్రేక్షకులందరికీ ఆయన సుపరిచితుడే. అటు వెండితెరపైనా కన్నీరు పెట్టించగలడు, ఇటు బుల్లితెరపై తన నవ్వులతో ఎంతో మందిని నవ్విస్తున్నాడు. మ‌రోవైపు రాజ‌కీయాల్లోనూ ఎంట్రీ ఇచ్చారు. ఇక తాజాగా ఈయ‌న మీడియాపై సంచ‌ల‌న ట్విట్ చేశారు. ప్రపంచాన్ని భయపెడుతోన్న కరోనా వైరస్‌ను గుర్తు చేస్తూ మీడియాపై సినీనటుడు, జనసేన నేత నాగబాబు వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు సోకుతున్న కరోనా వైరస్ నియంత్రణలోకి వస్తుందేమీ కానీ, మీడియాకు పట్టిన వైరస్ వదిలేలా లేదని ట్వీట్ చేశారు.

‘కరోనా వైరస్ ప్రజల కంటే మీడియాకే వేగంగా వ్యాపిస్తోంది. 90 శాతం మీడియా ఈ భయంకర వైరస్ బారిన పడింది. కానీ, మరణాల గురించి నిర్ధారణ కాలేదు. నిజమైన కరోనా వైరస్‌ నియంత్రణలోకి వస్తుందని భావిస్తున్నాను. అయితే, మీడియాకు పట్టిన వైరస్‌ మాత్రం వదులుతుందన్న ఆశ లేదు’ అని అన్నారు. ఆయన ట్వీట్‌పై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు ‘హా హా! సూపర్ పంచ్ అన్నయ్య’ అని ఒకరు కామెంట్ చేశారు. ‘అదిరింది’ అంటూ మరొకరు కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version