కివీస్ టూర్ లో ఇండియాకు తొలి ఓటమి…!

-

హామిల్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య 3 వన్డేల సీరీస్ లో భాగంగా జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్  జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 347 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా తొలి వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మంచి ఓపెనింగ్ ఇచ్చారు. అయితే స్వల్ప పరుగుల తేడాతో ఇద్దరు అవుట్ అయ్యారు.

ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ, యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ స్కోర్ బోర్డు ముందుకి నడిపించారు. ఆచితూచి ఆడుతూ ఇద్దరు కివీస్ బౌలర్లకు ఎదురొడ్డి నిలిచారు. శ్రేయాస్ అయ్యర్ అయితే తొలుత పరుగులు చేయడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. క్రీజ్ లో నిలదొక్కుకున్న తర్వాత స్వేచ్చగా ఆడాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ వన్డేల్లో తన 58 వ సెంచరి నమోదు చేసాడు.

ఇష్ సోదీ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ఇక ఆ తర్వాత అయ్యర్, రాహుల్ తో కలిసి ఇన్నింగ్స్ ని ముందుకి నడిపించాడు. రాహుల్ వచ్చీ రావడంతోనే చెలరేగిపోయాడు. ఈ క్రమంలో అయ్యర్ వన్డేల్లో తన తొలి సెంచరి పూర్తి చేసుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడినా సరే తర్వాత మాత్రం దూకుడుగా ఆడాడు. రాహుల్ మాత్రం ముందు నుంచే ఎదురు దాడి చేసాడు.

అయితే స్కోర్ పెంచే క్రమ౦లో భారీ షాట్ ఆడిన అయ్యర్ సౌథీ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. 107 బంతులలో 11 ఫోర్లు ఒక సిక్స్ సాయంతో 103 పరుగులు చేసాడు. అయ్యర్ అవుట్ అయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన జాదవ్ ఒక సిక్స్ ఒక ఫోర్ తో 15 బంతుల్లో 26 పరుగులు చేసి అలరించగా… రాహుల్ మాత్రం కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. రాహుల్ దూకుడు చూస్తే సెంచరి చేస్తాడని భావించారు అంతా.

అయితే అనూహ్యంగా కివీస్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాహుల్ సెంచరీ చేయలేదు. 64 బంతుల్లో ఆరు సిక్సులు మూడు ఫోర్ల సాయంతో 88 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఆ తర్వాత భారీ లక్ష్య చేధనతో బరిలోకి దిగిన కివీస్ కి ఓపెనర్లు మార్టిన్ గుప్తిల్ (32), నికోలస్ (78) మంచి ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్ కి 85 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు.

గుప్తిల్ అవుట్ అయిన తర్వాత వచ్చిన బ్లన్ డేల్ 9 పరుగులకే అవుట్ అయినా… నికోలస్ తో కలిసి సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ విరుచుకుపడ్డాడు. ఎక్కడా కూడా భారత బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా దూకుడుగా ఆడాడు. ఆ తర్వాత నికోలస్ 78 పరుగుల వద్ద కోహ్లీ అద్భుతమైన రనౌట్ తో వెనుతిరిగినా… కెప్టెన్ లాథంతో కలిసి స్కోర్ బోర్డు ని పరుగులు పెట్టించాడు.

ఇద్దరు కూడా భారత బౌలర్లను చీల్చి చెండాడారు. స్పిన్, పేస్ అనే తేడా లేకుండా మైదానం నలువైపులా షాట్లు ఆడారు. సిక్సులు ఫోర్లు కొడుతూ విజయం దిశగా నడిపించారు. వీరిద్దరి ధాటికి సాధించాల్సిన రన్ రేట్ 4కి పడింది. కొండంత లక్ష్యాన్ని కూడా ఇద్దరూ ఊదేసారు. ఈ క్రమంలో కుల్దీప్ బౌలింగ్ లో లాథం భారీ షాట్ కి ప్రయత్నించి షమీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత నీషం కూడా 9 పరుగులు చేసి శమీ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.

అనంతరం గ్రాండ్ హోం రనౌట్ అయ్యాడు. సాంత్నర్ తో కలిసి కలిసి టేలర్ పని పూర్తి చేసాడు. భారత బౌలర్లలో యాదవ్ రెండు వికెట్లు తీయగా శమీ, ఠాకూర్ చెరో వికెట్ తీసారు. కివీస్ బౌలర్లలో సౌతీ రెండు, గ్రాండ్ హోం, ఇష్ సోదీ చెరో వికెట్ తీసారు. ఇదిలా ఉంటే రెండు జట్లు కూడా భారీగా వైడ్లు వేసాయి. కివీస్ 19 వైడ్లు వేయగా భారత్ ఏకంగా 27 వైడ్లు వేసింది. దీనితో 23 పరుగులు కూడా మ్యాచ్ విజయంపై ప్రభావం చూపించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version