మళ్లీ జబర్దస్త్ లోకి వస్తానంటున్న నాగబాబు..!

-

తెలుగు బుల్లితెరపై విజయవంతంగా నడుస్తున్న ఏకైక కామెడీ షో జబర్దస్త్.. ఎన్ని షోలు వచ్చినా సరే ఈ షో కి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. మల్లెమాల మొదలుపెట్టిన ఈ ప్రోగ్రాం ఇప్పటికి కూడా 10 సంవత్సరాలు పూర్తవుతున్నా క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. రేటింగ్ లో కూడా అదరగొట్టేస్తోంది. ముఖ్యంగా బుల్లితెరపై తనకంటూ బెంచ్ మార్క్ చూపిస్తోంది ఈ కార్యక్రమం. జబర్దస్త్ అనేది కేవలం ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే కాదు ఎంతో మందిని ఆర్థికంగా ఆదుకుంది కూడా.. అలాగే టాలెంట్ ఉన్నవారికి మంచి వేదిక ఆయన జబర్దస్త్.. వారందరికీ కూడా ఉన్నత స్థానాన్ని కల్పించింది.

ఇదిలా ఉండగా ఈ షో ఇంత సక్సెస్ కావడానికి కారణం జడ్జిలుగా వ్యవహరించిన నాగబాబు, రోజాలని చెప్పాలి. వీరి కాంబో కూడా ఈ షోని బాగా ముందుకు తీసుకెళ్ళింది. అయితే ఈ షో నుండి అర్ధాంతరంగా నాగబాబు తప్పుకోవడం.. పోతూ పోతూ ఆయన మల్లెమాలపై, జబర్దస్త్ పై విమర్శలు చేయడం అన్నీ కూడా జరిగిపోయాయి. దీంతో నాగబాబుకు మల్లెమాలలో అవమానం జరిగిందని, అందుకే ఆయన వెళ్లిపోయాడని వార్తలు వినిపించాయి. తాజాగా జబర్దస్త్ లోకి మళ్ళీ నాగబాబు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో నాగబాబు క్లారిటీ ఇచ్చారు.

నాగబాబు మాట్లాడుతూ.. నేను వాలెంటరీగా బయటకు వచ్చాను.. నా అంతట నేను వెళ్లి అడగను.. ఒకవేళ వాళ్ళు నన్ను రమ్మని అడిగితే.. తప్పకుండా వెళ్తాను. కానీ అది జరగని పని . శ్యాం ప్రసాదరెడ్డి తో నాకు ఎటువంటి గొడవలు లేవు. అప్పట్లో కొంతమంది స్టాఫ్ ఆటిట్యూడ్ చూపించారు. కుర్రాళ్లకు అన్యాయం జరిగిందని భావించి.. నేను బయటకు వచ్చాను. జబర్దస్త్ పై నేనెప్పుడూ నెగిటివ్గా మాట్లాడలేదు.. నేను వెళ్ళిపోయాక కూడా కొంతమంది బయటకు వచ్చేశారు అప్పుడు నేను ఎవరిని రమ్మని చెప్పలేదు. నా రిస్కు నేను పడ్డాను . చంద్ర, ఆర్పీలు నాతోనే ఉండాలన్న ఉద్దేశంతో వాళ్లే రిస్కు తీసుకొని వచ్చేసారు అంటూ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version