మెగా ఫ్యామిలీ, అల్లు అర్జున్ ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు మరోసారి జోరుగా ప్రచారం సాగుతోంది.పుష్ప-2 సినిమా విడదలకు సిద్ధమవుతున్న తరుణంలో అల్లుఅర్జున్ మీద సోషల్ మీడియాలో జోరుగా ట్రోలింగ్ జరుగుతోంది. ఎందుకంటే ఇటీవల బిహార్లో జరిగిన పుష్ప-2 ఈవెంట్‌లో అల్లు అర్జున్ ప్రవర్తనే అందుకు కారణంగా తెలుస్తోంది. అందరికీ ఫ్యాన్స్ ఉంటే తనకు మాత్రం ఆర్మీ ఉందని.. అదే విధంగా అన్‌స్టాపబుల్ షోలో నా కంటే గొప్ప యాక్టర్స్ ఎవరూ లేరని.. నా తర్వాత కూడా నేనే అంటూ బన్నీ కామెంట్స్ తీవ్ర విమర్శలకు దారితీశాయి.
ఈ క్రమంలోనే మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ‘తప్పుడు మార్గంలో వెళ్తున్నావని గుర్తిస్తే మంచిది.లేకపోతే మళ్లీ మీరు మీ మూలాలను కలుసుకోవడం కష్టం’అని ఓ కోట్ పెట్టారు.ఇది పరోక్షంగా అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ నాగబాబు ఈ ట్వీట్ పెట్టారా? అని నెటిజన్లు అయోమయంలో ఉండిపోయారు. కొందరు మాత్రం ఇది అల్లు అర్జున్‌ను ఉద్దేశించే పెట్టారని కామెంట్స్ చేస్తున్నారు.