రెండు తలల పాము కంటే…రెండు నాలుకలు ఉన్న రేవంత్ చాలా డేంజర్ అంటూ మాజీ మంత్రి హరీష్ రావు చురకలు అంటించారు. సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి హరీష్ రావు వీడియోలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా హాట్ కామెంట్స్ చేశారు హరీష్ రావు. రెండు తల్కాయల పాము ఉంటది. దాన్ని చూసి మనం భయపడుతం. కానీ పాపం అదేం అనదు. అది పెద్ద ప్రమాదకరం కాదని తెలిపారు.
కానీ రెండు నాల్కల మనిషి ఉంటడు. ఆయన్ను చూసి మనంపెద్దేం భయపడం. కానీ వామ్మో శానా ప్రమాదకరం అంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మండిపడ్డారు. రెండు నాల్కల వైఖరికి నిలువెత్తు నిదర్శనం ఎవరంటేనిస్సందేహంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. డబుల్ ఎడ్జుడ్ నైఫ్ తో జాగ్రత్తగ ఉండొచ్చు. కానీ డబుల్ టంగ్డ్లీడర్ ప్రజల్ని ముంచిపడేస్తడని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వానాకాలం, యాసంగివి రెండు విడుతల రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంక్రాంతికి ఇచ్చే రైతు భరోసా రెండు విడుతలు కలిపి ఎకరానికి రూ.15000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు హరీష్ రావు.