ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ కు సిద్ధమైన అక్కినేని హీరో..!?

-

అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నాడు అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా నటించిన లవ్ స్టోరీ సినిమా షూటింగ్ పూర్తై మిగతా పనులు పూర్తి చేసుకుంటుంది. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న అక్కినేని హీరో నాగచైతన్య.. ఇక ఇప్పుడు మనం సినిమా దర్శకుడు విక్రమ్ కుమార్ తో మరో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు థాంక్యూ అనే టైటిల్ ఖరారు చేశారట చిత్రబృందం. అయితే ఈ సినిమాలో నాగచైతన్య సరసన ఏకంగా ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారట. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు దసరా సందర్భంగా ప్రారంభం కాగా ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు ప్రస్తుతం సమాచారం. కాగా మొదటి సారి ముగ్గురు హీరోయిన్లతో సినిమా చేయబోతున్నాడు అక్కినేని హీరో నాగచైతన్య.

Read more RELATED
Recommended to you

Exit mobile version