నాగచైతన్య-శోబిత వివాహం జరిగేది ఆరోజే..!

-

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. నాగచైతన్య-సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత శోబితతో పెళ్లి జరుగుతుందని రూమర్స్ వినిపించాయి. ఆ రూమర్స్ ని నిజం చేస్తూ ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ఆ తరువాత గత రెండు రోజులుగా పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

హీరో నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల  వివాహ వేడుకలకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబరు 4న  అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా జరిగే ఈ వేడుకను నిర్వహించేందుకు పెద్దలు నిర్ణయించారు. ఇటీవల శోభిత కుటుంబం నుంచి ఇస్తున్న వెడ్డింగ్ కార్డు వైరల్ కాగా, తాజాగా నాగచైతన్య కుటుంబం పంచుతున్న వెడ్డింగ్ కార్డు కూడా బయటకు వచ్చింది. ఇందులో వివాహ తేదీతో
పాటు, ముహూర్తం కూడా రాశారు. డిసెంబరు 4న రాత్రి 8.13 నిమిషాలకు నాగచైతన్య-శోభిత
వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version