నాగచైతన్య చాలా రిజర్వడ్ అందుకే సమంత..!!

-

అక్కినేని నాగచైతన్య ఈరోజు పుట్టినరోజు చేసుకుంటున్నారు. పుట్టిన రోజుకు తన తోడు లేకుండా పోయింది.ఏమాయ చేశావే సినిమాతో హీరోయిన్ సమంత తో మొదలైన ప్రయాణం, సినిమా లాగా అనేక మలుపులు తిరుగుతూ గత ఏడాది ముగిసింది. విడాకులు తీసుకుని ఎవరి బతుకు వారు బతుకుతున్నారు.

నాగ చైతన్యకు సమంతకు 2017 October 6న హిందూ సంప్రదాయంలో పెళ్లి జరిగింది. మళ్లీ మరునాడు క్రిస్టియన్ సంప్రదాయంలో వివాహాం జరిగింది. అయితే పెళ్లి అయిన తరువాత వీరిద్దరూ చాలా రోజులు మంచిగానే ఉన్నారు. ఇద్దరూ కలిసి సినిమాలలో నటించారు, అలాగే కొన్నిరకాల ప్రకటనల్లో ఆదర్శ జంటగా కనపడి సందడి చేశారు. ఇక మీడియాలో కూడా వాళ్ళు ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉండేవారు.

అప్పట్లో వచ్చిన తన పుట్టిన రోజు కు సమంత హంగామా చేసేది. ప్రస్తుతం కనీసం ట్విట్టర్ లో ట్వీట్ కూడా చేయడం లేదు. అసలు వీరు ఎందుకు విడిపోయారు అంటే సన్నిహితులు రకరకాల కారణాలు చెబుతున్నారు. వారి ప్రకారం అక్కినేని కుటుంబం నాగేశ్వరరావు మొదటి నుండి కొంచం క్రమశిక్షణ గా ఉండే కుటుంబం. కాని సమంత కొంచం జోవియల్ గా ఫ్రెండ్స్ తో చిల్ అవుతూ ఉండే లక్షణం. అదీకాక నాగ చైతన్య ఎప్పుడూ నెమ్మదిగా రిజర్వడ్ గా ఉంటాడు.కాని సమంత కు లైఫ్ అడ్వెంచర్ గా ఉండాలి. దీనితో ఇద్దరి మనస్తత్వం కలిసేది కాదు. దానికి తోడు ఫ్యామిలీ లో పిల్లలు కనాలని పోరు పెట్టడంతో స్వతహాగా సొంతగా వ్యక్తిత్వం తో ఉండే సమంత విడాకులు తీసుకోవడానికి మొగ్గు చూపిందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version