టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బిగ్ బాస్ షో తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక నాగార్జున తన కెరీర్ తో పాటు తన ఇద్దరు కొడుకులు అఖిల్ నాగచైతన్య కెరీర్ లను సైతం గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నిన్నే పెళ్ళాడుతా” సినిమా లో ఎక్కువగా బైక్ రైడింగ్ సీన్లు ఉంటాయని నాగార్జున తెలిపారు. ఈ సినిమాలో డూప్ లేకుండా తానే సొంతంగా బైక్ నడిపానని నాగార్జున చెప్పారు. 80, 90 స్పీడ్ లో బండి నడిపా అని ఇప్పుడు ఆ సీన్లు చూస్తే తనకు ఆశ్చర్యం కలుగుతుంది అని నాగార్జున అన్నారు.
అయితే డూప్ లేకుండా బైక్ రైడింగ్ సీన్లు చేయడం చాలా ప్రమాదకరమని నాగార్జున అన్నారు. అంతే కాకుండా ఇప్పుడు అఖిల్ నాగచైతన్య ఒక వేళ అలాంటి సీన్లలో నటిస్తానంటే తాను ఒప్పుకోను అని చెప్పారు. తనను కూడా అలాంటి సీన్లలో నటించాలని ఎవరైనా అడిగితే తాను నటించనని నాగార్జున స్పష్టం చేశారు. ఇది ఇలా ఉండగా నాగార్జున ప్రస్తుతం ది ఘోస్ట్ అనే సినిమాలో నటిస్తున్నారు. అంతేకాకుండా “బంగార్రాజు” అనే మరో చిత్రంలో కూడా నాగార్జున నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగచైతన్య కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.