ప్రాజెక్టుల‌కు జ‌ల‌క‌ళ‌.. నాగార్జునసాగర్ లో 18 క్రస్టు గేట్లు ఎత్తివేత

-

ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో వాగులు, వంక‌లు పొంగి ప్ర‌వ‌హిస్తున్నాయి. జ‌లాశ‌యాలు, ప్రాజెక్టుల‌న్నీ నిండుకుండ‌ల‌ను త‌ల‌పిస్తున్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగ‌ర్‌, శ్రీరాంసాగ‌ర్‌, పులిచింత‌ల‌, సింగూరు, క‌డెం ప్రాజెక్టుల‌న్నీ జ‌ల‌క‌ళ‌ను సంత‌రించుకున్నాయి. వ‌ర‌ద నీరు పోటెత్తుతుండ‌టంతో అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు. ఆయా ప్రాజెక్టుల క్ర‌స్ట్ గేట్ల‌ను ఎత్తి నీటిని దిగువ‌కు వ‌దులుతున్నారు. ఈ క్ర‌మంలోనే నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది.

దీంతో అధికారులు ప్రాజెక్ట్ 10 క్రస్టు గేట్లను 15 ఫీట్లు, 8 క్రస్టుగేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మొత్తం 18 క్రెస్ట్ గేట్స్ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 3,68,776 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు కాగా… ప్రస్తుత నీటి నిల్వ 309.0570 టీఎంసీలుగా కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను…ప్రస్తుత నీటిమట్టం 589.00 అడుగులకు చేరింది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 781 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 490 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుతం 698.200 అడుగులకు నీటిమట్టం చేరింది. సింగూరులో ప్ర‌స్తుతం నీటి మ‌ట్టం 522.570 మీటర్లకు చేరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version