నాగార్జున సాగర్ లో షర్మిల స్వతంత్ర అభ్యర్థి…?

-

తెలంగాణలో వైయస్ షర్మిల పార్టీ పెట్టడంతో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు బయటకు వెళ్ల వచ్చు అనే దానిపై టిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా లెక్కలు వేసుకుంటున్నారు. టిఆర్ఎస్ పార్టీ అధిష్టానంలో మాత్రం ఇప్పుడు ఆ పార్టీలో ఎవరు బయటకు వెళ్ళక పోవచ్చు అనే అభిప్రాయం కూడా ఉంది. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ కు ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాల్లో షాక్ ఇచ్చే అవకాశాలు కూడా ఉండవచ్చు.

ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు అని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు షర్మిల నుంచి టిఆర్ఎస్ పార్టీ కచ్చితంగా ఊహించని దెబ్బ తగిలే అవకాశాలు కూడా ఉండవచ్చుననే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. నల్గొండ జిల్లా పరిధిలో జరుగుతున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో షర్మిల స్వతంత్ర అభ్యర్థిని ఒకరిని నిలబెట్టే అవకాశం ఉందని అంటున్నారు.

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరిగే లోపు పార్టీ నిర్మాణం ఎలాగో జరగదు. కాబట్టి స్వతంత్ర అభ్యర్థిని నిలబెట్టే ఆలోచనలో వైయస్ షర్మిల ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను అలాగే నేతలను తీసుకోవడం పక్కనపెట్టి నాగార్జునసాగర్ మీద ఆమె గట్టిగా ఫోకస్ చేసినట్లుగా కూడా సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే ఆమె తన అనుచరులతో కూడా చర్చలు జరిపారని నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థుల తో కూడా ఒకసారి ఆమె సమావేశమై ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version