న‌ల్గొండ : బ‌తికుండ‌గానే త‌ల్లికి పెద్ద‌క‌ర్మ‌..మెంటల్ పుత్రుడి నిర్వాకం..!

బ‌తికుండ‌గా ఓ కొడుకు త‌ల్లికి పెద్ద‌క‌ర్మ చేయాల‌ని నిర్ణ‌యించాడో మెంట‌ల్ పుత్రుడు దాంతో ఆ త‌ల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘ‌ట‌న న‌ల్గొండ జిల్లా న‌కిరేక‌ల్ లో చోటు చేసుకుంది. ప‌ట్ట‌ణానికి చెందిన పోశ‌మ్మ అనే వృద్ధురాలికి ఇద్ద‌రు కుమారులు..న‌లుగురు కుమార్తెలు ఉన్నారు. అయితే చాలా కాలంగా పోశ‌మ్మ త‌న చిన్న కుమారుడి ఇంటి వ‌ద్ద‌నే ఉంటోంది. ఈ నేప‌థ్యంలో పెద్ద‌కుమారుడు త‌న త‌ల్లి ఈనెల 19 న చ‌నిపోయింద‌ని..28వ తేదీన పెద్దక‌ర్మ ఉంద‌ని ప‌త్రిక‌లు ముద్రించి అంద‌రికీ పంచ‌డం మొద‌లు పెట్టాడు.

nalgonda news
nalgonda news

చాలా మంది బంధువులు చిన్న కొడుకుకు ఫోన్ చేసి అడ‌గ‌గా పెద్దకొడుకు నిర్వాకం బ‌య‌ట‌ప‌డింది. దాంతో పోశ‌మ్మ తాను బ‌తికే ఉన్నాన‌ని పెద్ద‌కొడుకు పై న‌కిరేక‌ల్ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేసింది. ఈ కేసును ప‌రిశీలిస్తున్నామ‌ని న‌కిరేక‌ల్ సీఐ చెబుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ వార్త తెలిసిన ఇరుగు పొరుగు వాళ్లు పెద్ద కొడుకు చేసిన నిర్వాకానికి నోరు వెల్ల‌బెడుతున్నారు. ఏదైనా గొడ‌వ‌లు ఉంటే మాట్లాడి ప‌రిష్క‌రించుకోవాల‌ని కానీ ఇలాంటి పిచ్చి ప‌నులు చేయ‌డ‌మేంట‌ని అంటున్నారు.