తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఓ ఆసక్తికర పర్యటన చోటుచేసుకుంది.మంగళవారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అసెంబ్లీకి హాజరయ్యారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన మల్లారెడ్డి.. ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనాడు పార్లమెంట్‌లో వాజ్‌పేయి, ఉమ్మడి ఏపీలో చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ లాంటి నాయకులు సభలో మాట్లాడుతుంటే ప్రజలు టీవీలకు హత్తుకొని పోయి చూసేవారని గుర్తుచేశారు.
కానీ, ఇప్పుడు అసెంబ్లీలో బట్టలు విప్పుడు, కత్తులు దూసుడే కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డికి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. వివేక్‌ను నమస్తే మంత్రి గారు అని మల్లారెడ్డి పలకరించగా.. థాంక్స్ మల్లన్న అని వివేక్ బదులిచ్చారు. రాష్ట్రంలో కోమటి రెడ్డి ఫ్యామిలీ, వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీలదే హవా నడుస్తుందని మల్లారెడ్డి అనగా.. బీఆర్ఎస్ టైంలో కేసీఆర్, మల్లారెడ్డిదే హవా నడిచిందని ఎమ్మెల్యే వివేక్ అనడంతో కాసేపు నవ్వులు పూశాయి.