ములుగు జిల్లాలోని కలెక్టరేట్‌కు రైతు కమిషన్ బృందం మంగళవారం ఉదయం చేరుకుంది.వారు క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడి ర రైతుల ఇబ్బందులు, పంటల నష్టం వివరాలపై పరిస్థితిని అధ్యయనం చేయనున్నట్లు సమాచారం. అయితే, మొక్కజొన్న సాగు చేసి పంట నష్టపోయిన రైతుల వివరాలను కమిషన్ కోరినట్లు తెలుస్తోంది.
అయితే, ఇటీవల ఎమ్మెన్సీ కంపెనీల నుంచి మొక్కజొన్న సాగు కోసం విత్తనానలు కొనుగోలు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై కమిషన్ అధ్యయనం చేయనున్నట్లు తెలిసింది. జిల్లాలో రైతుల వివరాలు, మొక్కజొన్న సాగు విస్తీర్ణం, పంట నష్టం,పెట్టుబడి వివరాలను వ్యవసాయ శాఖ సిద్దం చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై విచారణ అనంతరం రైతు కమిషన్ బృందం చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.