Cheetah sasha: నమీబియా చీతాల్లో ‘సాశా’ మృత్యువాత

-

గతేడాది సెప్టెంబరులో నమీబియా నుంచి భారత్ కు ఎనిమిది చీతాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ వాటిని మధ్యప్రదేశ్‌ కునో జాతీయ పార్కులోని ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేశారు. అయితే, వాటిలో ‘సాశా’ అనే ఆడ చీతా సోమవారం అనారోగ్యంతో మృత్యువాత పడింది. కిడ్నీ సంబంధిత వ్యాధితో సాశా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.

‘జనవరి 22న ‘సాశా’ అస్వస్థతతో కనిపించింది. దీంతో ఆరోగ్య పరీక్షల నిమిత్తం క్వారంటైన్‌లోకి తరలించాం. రక్తపరీక్షలతోపాటు అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌లో ఆ చీతాకు మూత్రపిండాల సమస్య ఉన్నట్లు తేలింది. దాని ఆరోగ్య చరిత్రను పూర్తిస్థాయిలో విశ్లేషించగా.. భారత్‌కు తీసుకొచ్చే ముందే ఈ సమస్య ఉన్నట్లు తేలింది. స్థానిక వైద్యులతోపాటు నమీబియా, దక్షిణాఫ్రికాలకు చెందిన నిపుణులు నిత్యం వైద్యసేవలు అందించారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి సోమవారం మరణించింది’ అని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. నమీబియా నుంచి 4- 6 ఏళ్ల వయసున్న ఐదు ఆడ, మూడు మగ.. మొత్తం ఎనిమిది చీతాలు వచ్చిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version