జగన్ హోం మంత్రిని కలిసినా… కోర్ట్ షాక్ ఇచ్చింది…!

-

అక్రమాస్తుల కేసులో వ్యక్తిగతంగా తాను హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన సిబిఐ న్యాయస్థానం పిటీషన్ కొట్టేస్తూ తీర్పు వెల్లడించింది. తాను రాజ్యంగా బద్ధమైన పదవిలో ఉండటం, రాష్ట్ర ఆర్ధిక శాఖ పరిస్థితి అంతగా బాగోకపోవడంతో వ్యక్తిగత హాజరు నుంచి కోర్ట్ మినహాయింపు ఇవ్వాలని జగన్ కోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసారు. దీనికి సిబిఐ కూడా కౌంటర్ దాఖలు చేస్తూ జగన్ పిటీషన్ పై కీలక వ్యాఖ్యలు చేసింది.

ఆయన ఎంపీగా ఉన్నప్పుడే సాక్ష్యులను ప్రభావితం చేసారని, అందుకే ఆయన్ను అప్పుడు అరెస్ట్ చేసామని అలాంటిది ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారని, పరిస్థితులు అన్నీ ఆయన చేతిలో ఉన్నాయని, జగన్ కి మినహాయింపు ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉందని కోర్ట్ కి సిబిఐ దాఖలు చేసిన పిటీషన్ లో పేర్కొంది. అలాగే ఆర్ధిక నేరస్తుల విషయంలో సుప్రీం చేసిన కీలక సూచనలను కూడా పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది. ఇరు వర్గాల వాదనలను ఈ నెల 18న విన్న నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం… నేడు తీర్పు వెల్లడించింది. ఇప్పుడు ఈ తీర్పు రాజకీయ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది.

కేంద్రంతో వైసీపీ సన్నిహితంగా ఉన్నా, జగన్ ఇప్పటికే ఈ పిటీషన్ తర్వాత రెండు సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని, హోం మంత్రి అమిత్ షాని కలిసినా ఎందుకు కోర్ట్ ఆ విధంగా తీర్పు వెల్లడించిందని… రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే జగన్ అక్రమాస్తుల విషయంలో కేంద్రం వేగంగా వ్యవహరించే అవకాశం ఉందనే అభిప్రాయలు కొంత కాలంగా వినపడుతున్నాయి. ఈ తరుణంలో కోర్ట్ వెల్లడించిన తీర్పు వాటికి బలం చేకూర్చే విధంగా ఉంది. ఇటీవల ఆయన హోం మంత్రిని కలిసే ఇదే విషయమై చర్చి౦చినా ఫలితం లేకపోవడంపై అటు జగన్ లో కూడా కలవరం మొదలైందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version