నాంపల్లి కోర్టు కీలక తీర్పు..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్

-

పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్‌కు బిగ్ రిలీఫ్ దక్కింది. ఈ ప్రమాదంలో రేవంతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కొడుకు శ్రీతేజ్ ఇప్పటికీ కిమ్స్ ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. తొక్కిసలాట ఘటనలో బన్నీ మీద ఎఫ్ఐఆర్ నమోదు అయిన విషయం తెలిసిందే. ఓ రోజు రోజు జీవితం సైతం గడపాల్సి వచ్చింది.

ప్రస్తుతం బెయిల్ మీద ఉన్న బన్నీ ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్పుతో అల్లు అర్జున్‌కు భారీ ఊరట లభించింది. బన్నీ విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. ప్రతి ఆదివారం చిక్కడ పల్లి పీఎస్‌కు వెళ్లాలన్న నిబంధనను కోర్టు మినహాయించింది. కోర్టు తీర్పుతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్లు ఖుషీ అవుతున్నారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news