రేషన్ కార్డు లేని వారికి శుభవార్త.. ఆ తేదీ నుంచి కొత్త కార్డులు జారీ!

-

రేషన్ కార్డు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత పదేళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా జారీ కాలేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి, గతంలోనూ రేషన్ కార్డు లేని వారిని దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ప్రజావాణి పేరిట దరఖాస్తులు సైతం స్వీకరించారు.

రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. శనివారం ఖమ్మం జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ..గత ప్రభుత్వాలు ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే రేషన్ కార్డులు ఇచ్చేవని.. కానీ, తమ ప్రభుత్వం రాష్ట్రంలోని అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వనుందని పేర్కొన్నారు. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కూడా ఇస్తామని తెలిపారు. ఇప్పటికే ఒక సెగ్మెంటుకు 3,500 చొప్పున ఇళ్లను కూడా కేటాయించామన్నారు. నాలుగు విడత్లలో రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news