టాలీవుడ్ స్టార్ హీరో, తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలయ్య మరో సాహసం చేశారు. ఆర్టీసీ బస్సు నడుపుతూ రచ్చ చేశారు నందమూరి బాలయ్య. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్త్రీ శక్తి పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా… విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ ముగ్గురు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఇక ఇటు హిందూపురం నియోజకవర్గంలో నందమూరి బాలయ్య స్వయంగా తానే ఆర్టీసీ బస్సును నడిపారు. మహిళలకు ఉచిత టికెట్ ఇచ్చి మరి ఆర్టీసీ బస్సును నడిపారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
View this post on Instagram