జాతీయ జెండా పై కాలు పెట్టిన ప్రభుత్వ విప్ జీవీ ఆంజనేయులు !

-

ఇవాళ దేశవ్యాప్తంగా ఇండిపెండెన్స్ డే సంబరాలు చాలా గ్రాండ్ గా జరిగాయి. 79వ స్వాతంత్ర దినోత్సవాలు నేపథ్యంలో… ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ మొదటి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి అలాగే చంద్రబాబు నాయుడు కూడా జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ జెండా ఆవిష్కరణ నేపథ్యంలో… చాలా చోట్ల… అనేక తప్పిదాలు చేశారు రాజకీయ నాయకులు.

కొంతమంది జెండాను తలకిందులుగా ఎగరవేయడం… లేదా జెండాను తొక్కడం లాంటివి చేశారు. కొంతమంది షూ లు విప్పకుండానే… జెండా ఆవిష్కరించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కూడా ఇదే తప్పిదాన్ని చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటో కూడా వైరల్ అవుతోంది. అదే సమయంలో కూటమి ప్రభుత్వానికి చెందిన వినుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జీవి ఆంజనేయులు కూడా పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. జాతీయ జెండా వేసిన.. ముగ్గు పైనుంచి నడుచుకుంటూ వచ్చారు వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. దీనిపై వైసీపీ పార్టీ సీరియస్ అవుతోంది. జాతీయ జెండాను అవమానించిన జీవి ఆంజనేయులుపై వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news