దేశ వ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలను పెంచేందుకు భారతీయ భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా డిజిటల్ చెల్లింపుల్లో మరింత భద్రతను కల్పించే అంశంపై సలహాలు, సూచనలతో పాటు మరింత ప్రచారం కల్పించేందుకు ఆర్‌బీఐ ఓ కమిటీని ఏర్పాటు చేసి ఆధార్ రూపకర్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకనిని అధ్యక్షుడిగా నియమించింది. ఐదుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీ దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల ప్రస్తుత పరిస్థితిని సమీక్షించి, లోపాలను గుర్తిస్తుందని ఆర్‌బీఐ వివరించింది.