ఓమైగాడ్.. ట్రక్ మీది నుంచి పోయిన బతికింది.. వీడియో

-

ఈ భూమ్మీద నూకలుండాలే కానీ.. ఏం జరిగినా బతికి బట్ట కడతాం అంటారు పెద్దలు. ఇలాగే 50 ఏళ్ల మహిళకు కూడా జరిగింది. తన మీది నుంచి చెత్త ట్రక్కు పోయినప్పటికీ బతికి బట్టకట్టింది. ఈ ఘటన గుజరాత్ లోని సూరత్ లో చోటు చేసుకున్నది.

సూరత్ లోని ఓ గుడి వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నది. రవీనా బేన్ అనే మహిళ సాయి బాబా గుడికి వెళ్లడానికి తన చెప్పులను విప్పింది. అక్కడ నిలబడింది. ఇంతలోనే వెనుక నుంచి వచ్చిన ట్రక్ తనను ఢీకొంటూ వెళ్లిపోయింది. దీంతో ఆ మహిళ ట్రక్ కింద పడిపోయింది. ట్రక్ అలాగే రివర్స్ లో వెళ్లిపోయింది. ఆ దేవుడి దయ వల్ల ఆ మహిళ ట్రక్ మధ్యలో పడిపోయింది. దీంతో ఆమెకు ఏం కాలేదు. ఈ ఘటన గుడి బయట ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version