పెళ్ళాన్ని అడ్డం పెట్టుకునే సన్నాసి చంద్రబాబు : నారా భువనేశ్వరి కొడాలి నాని కౌంట‌ర్ !

-

చంద్ర‌బాబు పై మారోమారు కొడాలి నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పెళ్ళాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే సన్నాసి చంద్రబాబు అని ఫైర్ అయ్యారు.  హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రారంభించింది రాజశేఖరరెడ్డి అని.. చంద్రబాబు చెప్పే మాటల పై చర్చకు నేను సిద్ధం…ఛాలెంజ్ చేస్తున్నాన‌ని పేర్కొన్నారు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాన‌ని స‌వాల్ విసిరారు. చంద్రబాబు ఓటీఎస్ లాంటి కార్యక్రమాన్ని జీవితంలో చేయలేడని ఫైర్ అయ్యారు.

ఈ కార్యక్రమం వల్ల ప్రభుత్వానికి వ్యతిరేక వస్తుంది అనుకుంటే చంద్రబాబు అండ్ టీం ఆనందంగా ఉండే వాళ్ళు అని.. ఇప్పటి వరకు 8 లక్షల మంది పేద వారు ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారని గుర్తు చేశారు. ఈ పథకాన్ని అర్హులైన వాళ్ళందరూ ఉపయోగించుకోవాలని… ఇన్నేళ్ళు హెరిటేజ్ తో పేదవాళ్ళను లూటీ చేశారని మండిప‌డ్డారు. ఓటర్ కార్డుకు ఆధార్ కార్డు తో లింక్ చేయాలని కేంద్రం బిల్లు తీసుకుని వచ్చిందని.. కుప్పం నియోజకవర్గం లో 6 నుంచి 10వేల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని.. ఈ బిల్లుతో చంద్రబాబు లాంటి వాళ్ళకు చెక్ పెడుతుందని చెప్పారు.

జగన్ అధికారంలోకి రాగానే బ్యాంకు ఇన్ని వేల కోట్లు అప్పుఇచ్చేటప్పుడు తిరిగి చెల్లిస్తారనే భరోసాతోనే ఇస్తారన్నారు. చేయకుండా చేశారు అన్ని వాళ్ళు కూడా వాళ్ళ పాపాన వాళ్ళు పోతారని… మా పార్టీకి వ్యూహకర్త ప్రశాంత కిషోర్… పవన్ కళ్యాణ్ కాదని చుర‌కలు అంటించారు. ఏం చేయాలో మాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని… తాను ఏం చేయాలో అది చేసుకుంటే మంచిదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version