జగన్ ఇంత దిగజారి పోతారనుకోలేదు.. నారా లోకేష్ వ్యాఖ్య‌లు..!

-

ఏపీలో మీడియాపై నిర్భయ కేసులు పెట్టడాన్ని టీడీపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక తాజాగా.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా దీనిపై ఘాటుగా స్పందించారు. విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టి పాఠశాల తరగతి గదులను ఆక్రమించే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో పరిస్థితిని, దానిపై తల్లిదండ్రుల ఆందోళనను ప్రపంచానికి చూపించినందుకు మీడియా ప్రతినిధులపై నిర్భయ కేసులు పెట్టారంటే మీ 8 నెలల పాలన ఎంత చెత్తగా ఉందో అర్థమవుతుందని అంటూ విమర్శించారు.

అస‌లు సీఎం జగన్ మరీ ఇంత దిగజారిపోతారనుకోలేదు, రైతుల ఉద్యమాన్ని అణచివేసేందుకు మీడియాపై తప్పుడు కేసులు బనాయిస్తారా? మీకసలు సిగ్గుందా? అంటూ మండిపడ్డారు. అయినా, మీడియా స్వేచ్ఛను హరించాలని ప్రయత్నం చేసిన ప్రతి నియంత కాలగర్భంలో కలిసిపోయారని నారా లోకేశ్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ప్రసారాలకు మూడు ఛానళ్లపై నిషేధం విధించారని, జీవో 2430 తెచ్చి మీడియాపై ఉక్కుపాదం మోపారని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు మీడియా ప్రతినిధులపై కేసులు పెట్టడం ద్వారా మీ భయమేంటో వెల్లడైంద‌ని లోకేష్ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version