దాయాది పాకిస్తాన్ భారత్ ని రెచ్చగోడుతూనే ఉంది. సరిహద్దుల్లో ఇప్పటికే ఉద్రిక్త వాతావరణం కోసం ప్రయత్నాలు చేస్తున్న పాకిస్తాన్ బ్యాట్ దళాల ద్వారా భారత్-పాక్ సరిహద్దు గ్రామాల్లో ఉన్న సామాన్య యువకులను హతమారుస్తుంది. అదే విధంగా కొన్ని గ్రామాల్లో అలజడి కోసం ఇప్పటికే పాకిస్తాన్ ఉగ్రమూకలు ప్రయత్నాలు చేస్తున్నాయని. లష్కరే తోయిబా వంటి సంస్థలు సరిహద్దు గ్రామాల్లో,
అలజడి రేపడానికి గాను ప్రయత్నాలు చేస్తున్నాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇక ఇదిలా ఉంటే… గురువారం అర్ధరాత్రి పాకిస్తాన్ బలగాలు దాడులకు తెగబడ్డాయి. సరిహద్దు గ్రామాల్లో తేలికపాటి ఆయుధాలతో పాకిస్తాన్ కాల్పులకు దిగింది. ఈ దాడిని భారత బలగాలు సమర్ధవంతంగా తిప్పికొట్టాయి. తాజాగా పాకిస్థాన్ క్షిపణి పరీక్ష చేపట్టింది. బాలిస్టిక్ క్షిపణి ఘజ్నవిని,
పాకిస్తాన్ గురువారం విజయవంతంగా పరిక్షించినట్లు పాక్ ఆర్మీ ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్(ISPR) అధికారిక ప్రకటన చేసినట్లు పాక్ పత్రిక డాన్ వెల్లడించింది. వివిధ రకాల వార్ హెడ్లను మోసుకెళ్లే సామర్థ్యం దీని సొంతమని డాన్ తన కథనంలో పేర్కొంది. ఉపరితలం నుంచి ఉపరితలంలోకి ప్రయోగించే ఘజ్నవి క్షిపణి 290 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాలను చేరుకోగలదని వివరించారు. ఈ నేపధ్యంలో భారత ఆర్మీ అప్రమత్తంగా వ్యవహరిస్తుంది.