ప్రజ‌లారా…జ‌గ‌న్‌కి ఇచ్చిన ఒక్క చాన్స్‌తో ఏమేమి కోల్పోయారో గుర్తించండి : లోకేశ్‌

-

ఢిల్లీ నుంచి విజయవాడకు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బయలు దేరారు. నారా లోకేశ్‌కు తెలుగుదేశం పార్టీ ఎంపీలు కనకమేడల, కేశినేని నాని, వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణారాజు వీడ్కోలు పలికారు. రేపు రాజమండ్రిలో చంద్రబాబుతో నారా లోకేశ్ ములాఖత్ కానున్నారు. ఆదివారం మళ్లీ తిరిగి లోకేశ్ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం చంద్రబాబునాయుడు స్పెషల్ లీవ్ పిటీషన్(SLP)పై సుప్రీంకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే.

ఇది ఇలా ఉంటె, ప్ర‌జ‌లారా జ‌గ‌న్‌కి ఇచ్చిన ఒక్క చాన్స్‌తో ఏమేమి కోల్పోయారో గుర్తించండి అంటూ టీడీపీ నేత నారా లోకేశ్ ట్విటర్‌లో పలు విషయాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జ‌గ‌న్ చేసిన పాపాలు రాయ‌ల‌సీమ‌కి శాపాలుగా మారుతున్నాయని, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌యోజ‌నాల‌కి ఉరివేస్తున్నాయని విమర్శలు గుప్పించారు. జగన్ అక్ర‌మాస్తుల కేసుల మాఫీకోసం ఏపీ ప్ర‌త్యేక‌హోదా అంశాన్ని వ‌దులుకున్నారని నారా లోకేశ్ చెప్పారు. రుషికొండ కేసు నుంచి త‌ప్పించుకునేందుకు విశాఖ రైల్వేజోన్ అంశాన్ని విడిచిపెట్టారని తెలిపారు. బాబాయ్ హత్య కేసులో త‌మ్ముడిని ర‌క్షించుకునేందుకు జగన్ పోల‌వ‌రం ప్రాజెక్టుని ప్ర‌శ్నార్థ‌కం చేశారని ఆరోపించారు.

జ‌గ‌న్ స‌ర్కారు వ‌ల్లే కృష్ణాజ‌లాల కేటాయింపుల పునఃస‌మీక్ష జ‌రుగుతోందని నారా లోకేశ్ విమర్శించారు. రాయ‌ల‌సీమ సాగు, తాగునీటి అవ‌స‌రాలు తీర్చే కృష్ణా జ‌లాలలో న్యాయ‌బ‌ద్ధ‌మైన వాటా కోల్పోతే, రాయ‌ల‌సీమ ఎడారిగా మారే ప్ర‌మాదం ఉందని చెప్పారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version