ఆడపడుచులు కోరుకుంటే మందు నిషేధిస్తాం : పవన్‌

-

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్ర నాల్గవ విడుత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నేడు కైకలూరులో నిర్వహించిన వారాహి విజయ యాత్రలో పవన్‌ మాట్లాడుతూ.. మేం ఏమీ మర్చిపోలేదు..‌ ఇదే పోలీసు స్టేషనులో పంచాయితీ పెడతాం మీకు. ఏ పోలీసులను మీరు ఇబ్బంది పెట్టారో అదే పోలీసులతో మీ మక్కెలు విరగ్గొట్టిస్తామన్నారు. కొల్లేరు ప్రజలకు జనసేన, టిడిపి వచ్చి బలమైన న్యాయం చేస్తామని, ఇంటర్ పూర్తి చేసిన విద్యార్ధులకు అసలు సర్టిఫికేట్ లు ఇవ్వలేకపోయారన్నారు పవన్‌.

అంతేకాకుండా.. ‘ప్రింటింగ్ ప్రెస్ లతో షేర్ కుదరలేదా.. దీనికి కూడా ఆ దరిద్రానికి ఒడిగట్టారా. భవిష్యత్తులో ప్రజల ఆస్తి దస్తావేజులు ప్రభుత్వం దగ్గర ఉంటాయట.. అది మా హక్కు.. మీ దగ్గర ఎలా ఉంటుంది. అంచెలంచెలుగా మన జీవితాలు చేతుల్లో పెట్టుకుంటారు. పది గ్రామాలు వైసీపీ గ్రామాలు అంటారట ఇక్కడ.. వైసిపి రహిత ఏపీ తెస్తాం. నువ్వెంత నీ బ్రతుకెంత జగన్‌‌.. గుర్తుపెట్టుకో. రేపటి నుంచీ మీడియాలో ఏం వాక్కుంటారో వాక్కోండి. 80 కిలోమీటర్ల రోడ్డుకి దిక్కు లేదు… వచ్చే దారిలో ఒక మహిళ, భర్త పడిపోయారు రోడ్డు మీద గుంతలతో.

 

చుట్టూ కొల్లేరు ఉన్నా 6వేల మంది ఇబ్బంది పడుతున్నారు అని నాకు లెటర్ ఇచ్చారు. కిడ్నీ రుగ్మతలు వస్తున్నాయి.. జనసేన టిడిపి ప్రభుత్వం లో నీట సమస్యల బాధ్యత నేనె తీసుకుంటా. 8600 కోట్లు పంచాయితీ నిధులు దోచేసారు. మీ బ్రతుక్కి మీ సొంత జేబులోంచి కనీసం పది లక్షలు పంచారా వైసీపీ నేతలు. నాకు తెలుసు చెపుతా క్లాస్ వార్ గురించి నన్నడుగు. బూం బూం మందు బాటిల్ ఎంత.. ఉదయం డబ్బులిచ్చి, సాయంత్రం మందు రూపంలో పట్టుకుని వెళ్ళిపోతున్నారు. కల్తీ మందు అధికారికంగా అమ్ముతుంటే చూస్తూ కూచున్నాం. ఆడపడుచులు కోరుకుంటే మందు నిషేధిస్తాం. ‘ అని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version