అవినీతి నిరూపించమంటే.. ప్యాకప్ అంటాడు..

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెద్దాపురం వేదికగా చేసిన ఆరోపణలపై మంత్రి లోకేశ్ ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు. మోదీ దత్త పుత్రుడు సీజన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మోదీ స్క్రిప్టు ని పవన్ యాక్షన్ తో సహా చేసి చూపడం చాలా విడ్డూరమన్నారు.  అవినీతి అంటూ గగ్గోలు పెట్టారని, నిరూపించమంటే ప్యాక్‌ప్‌ అన్నారని ఎద్దేవా చేశారు.  కొత్తగా మరో అవినీతి అంటూ.. బాక్సైట్‌ మసి పూసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పసలేని ఆధారాలు లేని తప్పుడు ప్రచారం మాని ఆధారాలు ఉంటే బయటపెట్టాలని ప్రతిసవాల్‌ విసిరారు. జాయింట్‌ ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ  (జేఎఫ్‌సీ) నివేదికను ఎందుకు బయటపెట్టలేదో చెప్పాలన్నారు. కేంద్ర చేసిన  అన్యాయంపై ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version