ఎక్కడ గన్? ఎక్కడ జగన్?..ఇక నైనా మేల్కోనండి – లోకేష్ ట్వీట్

-

ఏపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌ సంచలన ట్వీట్‌ చేశారు. వైసిపి పాలన లో మహిళలు బయటకి రావాలంటేనే భయాందోళనకు గురవుతున్నారని మండి పడ్డారు. రోజుకో ఆడబిడ్డ బలైపోతుంటే తాడేపల్లి ప్యాలస్ లో ఎలా నిద్రపడుతుంది జగన్ రెడ్డి గారు? విజయనగరం జిల్లాలో అమానవీయ ఘటన జరిగినా స్పందించలేనంతగా ఏం వెలగబెడుతున్నారు? అని నిలదీశారు.

విజయనగరం జిల్లా డెంకాడ మండలం బేతనపల్లి సమీపంలో యువతిని అత్యాచారం చెయ్యడంతో పాటు గుర్తు పట్టలేనంతగా పెట్రోల్ పోసి తగలబెట్టారు మృగాళ్లు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ గన్? ఎక్కడ జగన్? ఇప్పటికైనా మేల్కొని మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. యువతిని పెట్రోల్ పోసి తగలబెట్టిన వెధవల్ని నడి రోడ్డుపై ఉరి తీసి మహిళల భద్రతకి భరోసా ఇవ్వండని కోరారు నారా లోకేష్‌. యధా సాక్షి యజమాని, తథా సాక్షి ఉద్యోగులు రెచ్చి పోతున్నారని నిప్పులు చెరిగారు నారా లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version