గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి..కమల్ హాసన్ ను మించిపోయాడు – నారా లోకేష్

-

గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి..కమల్ హాసన్ ను మించిపోయాడు అని నారా లోకేష్ చురకలు అంటించారు. ప్ర‌తీ రోజూ ధ‌ర్మ‌వ‌రం వీధుల్లో నీ యాక్టింగ్ మా మంగ‌ళ‌గిరి క‌ర‌క‌ట్ట క‌మ‌ల్ హాస‌న్‌ని మించిపోతోంది. నియోజ‌క‌వ‌ర్గంలో ఏ అక్ర‌మం అడ్ర‌స్ లాగినా నీ ద‌గ్గ‌రే తేలుతోంది. ఏ క‌బ్జా క‌దిపినా గుడ్ మార్నింగ్ కేటురెడ్డిదేన‌ని స్ప‌ష్టం అవుతోందని ఫైర్ అయ్యారు నారా లోకేష్.


చిత్రావ‌తి న‌ది ఉప్ప‌ల‌పాడు రీచ్ నుంచి త‌ర‌లించే టిప్ప‌ర్ల‌న్నీ కేటువేనంటున్నారు. మ‌న గుడ్ మార్నింగ్ షూటింగ్‌లో ఎర్రగుట్ట క‌బ్జా, చెరువు పూడ్చి ఫాంహౌస్ క‌ట్టుకోవ‌డం, వంద‌ల ఎక‌రాల క‌బ్జా, చిత్రావ‌తి న‌ది నుంచి ఇసుక మాఫియా ఎపిసోడ్ల స్కిట్ల షూట్‌కి ఎప్పుడూ ప్లాన్ చేయ‌లేదా! అని నిలదీశారు. గుడ్ మార్నింగ్ అంటూ వీధుల్లో షో చేసే యూట్యూబ్ స్టార్ కేతిరెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి చేసేవి కబ్జాలు,ఇసుక దందాలు,సెటిల్మెంట్లు.నిన్న సాయంత్రం ఎమ్మెల్యే గుట్ట చెరువులు ఆక్ర‌మించి చేసిన క‌బ్జాలు చూపించాను.ఈ రోజు ఉద‌యం చిత్రావతి నది ఉప్పలపాడు రీచ్ నుంచి సాగిస్తున్న ఇసుక మాఫియా దందా ఇదంటూ ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version