ఈ మధ్యకాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో శ్వాస సమస్యలు కూడా ఒకటి. శ్వాస తీసుకునే క్రమం లో ఇబ్బందులు పడడం లేకపోతే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడడం వంటివి జరుగుతోంది. బ్రీతింగ్ కెపాసిటీని చాలా మంది పెంచుకోవాలని అనుకుంటున్నారు అందుకోసం రకరకాల పద్ధతుల్ని ఎంచుకుంటున్నారు. అయితే లంగ్స్ కెపాసిటీ ని పెంచుకొని ఊపిరి సామర్థ్యాన్ని పెంచుకోవాలంటే కచ్చితంగా ఈ చిట్కాలను ప్రయత్నం చేయండి.
డీప్ బ్రీతింగ్ వ్యాయామాలు:
శ్వాస కి సంబంధించిన వ్యాయామ పద్ధతుల్ని పాటిస్తే కచ్చితంగా బ్రీతింగ్ కెపాసిటీని పెంచుకోవచ్చు. ముఖ్యంగా ఆస్తమా, సి పి ఓ డి సమస్యలతో బాధపడే వాళ్ళకి మేలు చేస్తాయి.
ఇంటర్వెల్ ట్రైనింగ్:
మీ ఊపిరితిత్తులు సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఇది కూడా బాగా ఉపయోగపడుతుంది. పైగా ఇంటర్వెల్ ట్రైనింగ్ మీయొక్క ఫిట్నెస్ లెవెల్స్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సిపిఓడీ లేదంటే ఆస్తమా సమస్యలతో బాధపడే వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది.
కార్డియా వాస్కులర్:
కార్డియా వాస్కులర్ వ్యాయామ పద్ధతుల్ని పాటసితే కూడా మీ యొక్క ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. బ్రీతింగ్ కూడా బాగుంటుంది. గుండె సమస్యలతో బాధపడే వాళ్ళకి డయాబెటిస్ ఒబిసిటీ సమస్యలతో బాధపడే వాళ్ళకి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది.
యోగ:
యోగ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు చాలా ఆసనాలు బ్రీతింగ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి సహాయం చేస్తాయి. యోగా ద్వారా ఒత్తిడి, యాంగ్జైటీ కూడా దూరం చేసుకోవచ్చు.
రెసిస్టెన్స్ ట్రైనింగ్:
స్ట్రెంత్ ట్రైనింగ్, వెయిట్ లిఫ్టింగ్ వంటివి చేయడం వలన కూడా మీ యొక్క బ్రీతింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఆస్తమా సిపిఒడి సమస్యలతో బాధపడే వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది.
సైక్లింగ్:
సైక్లింగ్ చేయడం వలన కూడా లంక్ కెపాసిటీ పెరుగుతుంది ఒత్తిడి దూరమవుతుంది. యాంగ్జైటీ సమస్య కూడా ఉండదు.
స్విమ్మింగ్:
స్విమ్మింగ్ ద్వారా కూడా మీరు మీ యొక్క ఊపిరితిత్తులు సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. శ్వాసకి సంబంధించిన సమస్యలతో బాధపడే వాళ్ళకి స్విమ్మింగ్ బాగా హెల్ప్ అవుతుంది.