టీటీడీ.. సూట్‌కేసు కంపెనీ కాదు..హిందువుల ఆత్మగౌరవం – నారా లోకేష్‌

-

నిన్న తిరుమల సన్నిధిలో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఒక్క సారిగా భక్తుల సంఖ్య పెరగడంతో.. ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే.. దీనిపై నారా లోకేష్‌ ఫైర్‌ అయ్యారు. టీటీడీ.. సూట్‌కేసు కంపెనీ కాదు..హిందువుల ఆత్మగౌరవం అంటూ వైవీ సుబ్బా రెడ్డిపై నారా లోకేష్‌ నిప్పులు చెరిగారు.

వైవీ సుబ్బారెడ్డి గారూ! లాభాలు, జే ట్యాక్స్ లెక్కేసుకోవ‌డానికి టిటిడి మీరు క్విడ్‌ప్రోకో ద్వారా దోచిన ల‌క్ష‌ల కోట్ల‌తో పెట్టిన సూట్‌కేసు కంపెనీ కాదు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల న‌మ్మ‌కం అని ట్వీట్‌ చేశారు.

స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్ల జారీలో నెల‌కొన్న గంద‌ర‌గోళం, పంపిణీలో అస్త‌వ్య‌స్త ప‌ద్ధ‌తితో జ‌రిగిన‌ తొక్కిస‌లాటలో ముగ్గురు గాయ‌ప‌డినా మీరు స్పందించ‌రా? మండే ఎండ‌లో టోకెన్ల కోసం చిన్న‌పిల్ల‌లు, వృద్ధుల‌తో శ్రీవారి భ‌క్తుల‌కు అష్ట‌క‌ష్టాలు పెట్ట‌డం మీకు న్యాయ‌మేనా? అని నిలదీశారు. శ్రీవారి సేవ‌లు, టికెట్లు, ప్ర‌సాదం రేట్లు మూడింత‌లు పెంచ‌డంపై వున్న ఆరాటం…భ‌క్తుల‌కి క‌నీస సౌక‌ర్యాలు క‌ల్పించ‌డంలో లేదు. వీఐపీల సేవ‌లో త‌రిస్తోన్న టిటిడికి సామాన్య భ‌క్తులు నానా అగ‌చాట్లు ప‌డుతున్నా ప‌ట్టించుకోక‌పోవ‌డం తీవ్ర విచార‌క‌రమని ఓ రేంజ్‌ లో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version