సీఎం జగన్ కు నారా లోకేష్ బహిరంగ లేఖ

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి టిడిపి నేత నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రానికి జీవనాడి లాంటి జల వనరుల ప్రాజెక్టులు నిర్వీర్యం కాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ కు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నరా లోకేష్ లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని విమర్శించారు.

” వైసీపీ అధికారంలోకి వచ్చాక సీమ ఎత్తిపోతలకు పథకం పేరుతో.. జల జగడం సృష్టించి జగన్ వేడుక చూస్తున్నారు. తెలంగాణలోని ఆస్తులు, కేసుల నుంచి రక్షణ కోసం ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టడం దారుణం. టిడిపి హయంలో ఏడాదికి రూ 13,1600 కోట్లు ప్రాజెక్టులపై ఖర్చు చేస్తే..వైసిపికి రూ 5, 844,77 కోట్లు వెచ్చించి ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. రివర్స్ టెండర్రింగ్ పేరుతో కమిషన్లు దండుకుంటున్నారు.

వంశధార, మహేంద్ర తనయ ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారు. వెలిగొండను అనుమతులు లేని ప్రాజెక్టుగా గెజిటులో పేర్కొన్నా.. కేంద్రాన్ని ప్రశ్నించలేని దయనీయ స్థితిలో జగన్ రెడ్డి ఉన్నారు. జగన్ ప్రభుత్వ తీరుతో రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. కమిషన్లు దండుకోవడం ఆపి, నీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి”. అని లేఖలో డిమాండ్ చేశారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version